ఆపరేషన్ నిమిత్తమై సకాలంలో బి పాజిటివ్ రక్తం అందజేత

పయనించే సూర్యుడు మార్చి 6 జబ్బర్ కామారెడ్డి కాంసెన్సీ ఇన్చార్జి. ప్రభుత్వ ఆసుపత్రిలో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఇంతియాజ్ (43) కు ఆపరేషన్ నిమిత్తమై బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో ఐవిఎఫ్ సేవాదళ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు జబ్బర్ సహకారంతో కృష్ణ బి పాజిటివ్ రక్తాన్ని రక్తదాత నర్సయ్య సకాలంలో రక్తాన్ని అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలు తెలియజేశారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి కావలసిన రక్తాన్ని అందజేయడం కోసం నిరంతరంగా కృషి చేస్తున్నామని,రక్తదాతలు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.రక్తదాత నర్సయ్య, సేవాదళ్ అధ్యక్షులు జబ్బర్ కృష్ణ కు అభినందనలు తెలియజేశారు.