పయనించే సూర్యుడు మార్చి 6 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ చిన్న పీరు తాండ (గ్రామ పంచాయతీ): ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని అమలు చేస్తూ చిన్న పీరు తాండ గ్రామ సర్పంచ్ మునిందర్ తన మాట నిలబెట్టుకున్నారు. ప్రతి ఆడబిడ్డ వివాహానికి ₹5000 ఆర్థిక సహాయం అందిస్తామని అప్పట్లో ప్రకటించిన ఆయన, ఆ హామీని నెరవేర్చుతూ తండాకు చెందిన ఒక పేద కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. వివరాల్లోకి వెళ్తే చిన్న పీరు తాండకు చెందిన హూన్య నాయక్ కుమార్తె లావణ్య వివాహం నిశ్చయమైన సందర్భంగా, ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం సర్పంచ్ మునిందర్ ₹5000 పెళ్లి కానుకగా అందజేశారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబానికి ఈ సాయం ఎంతో ఉపయోగపడుతుందని స్థానికులు తెలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఆడబిడ్డ పెళ్లికి సహాయం చేయడం అభినందనీయమని తండా వాసులు సర్పంచ్‌ను ప్రశంసించారు. పేద కుటుంబాలకు ఇలాంటి సాయం చేయడం సమాజానికి మంచి సందేశం ఇస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తండా పెద్దలు, యువజన నాయకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.