ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడిని ఖండించండి.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 6 // నారాయణపేట జిల్లా బ్యూరో // ఇజ్రాయెల్, అమెరికాతో భారత్ దౌత్య, వాణిజ్య సంబంధాలు రద్దు చేసుకోవాలి. CPI(ML) మాస్ లైన్ పార్టీ ఆధిపత్యం కోసం ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నా యుద్ధ దురాక్రమణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో ట్రంప్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా నాయకులు రామకృష్ణ అధ్యక్షత వహించగా ఈ సందర్బంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి కాశీనాథ్, ఏ సలీం మాట్లాడుతూ పశ్చిమ ఆసియా పై, ఆయిల్ పై ఆధిపత్యం కోసమే ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడులకు, యుద్ధానికి దిగింది. ఇది అత్యంత హేయమైన, అన్యాయమైన చర్య. ప్రపంచ ఆధిపత్య ధోరణి విధానం. ఇరాన్ అధ్యక్షుడు ఖుమేనీని 30 అధునాతన అయిల్ బాంబులతో హత్య చేసినట్లు ట్రంప్ ప్రకటించాడు. నిన్న వెనుజుల అధ్యక్షుడు మదురోనీ ఎత్తుక పోయి ఆ దేశాన్ని అదుపులోకి తెచ్చుకున్నారు. మొన్న గాజానీ మరణభూమిగా మార్చారు. ఇవ్వాళ ఇరాన్ పై ఉన్మాద దురాక్రమణకు పూనుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకులు ఎం కాలేశ్వర్, జయలక్ష్మి, బి యాదగిరి, బి.నరసింహ పాల్గొని మాట్లాడారు ప్రపంచ వనరులు కొల్లగొట్టడానికి, ప్రపంచ వాణిజ్య, రాజకీయ, ఆర్థిక ఆధిపత్యం కోసం అమెరికా, దాని పెంపుడు జంతువు ఇజ్రాయెల్ మారణహోమం చేస్తూ… రక్తపు చేతులతో మానవత్వం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నది. ఇది నగ్నమైన అమానుష చర్యలకు దొంగ ముసుగు మాత్రమే. నరహంతకులతో చేతులు కలుపుకొని, ఆలింగనాలూ భారత దేశం చేసుకోవడమే రక్త, నరహంతక చర్యలలో భాగం కావడమే. మోడీ, ట్రంప్, నేతన్యాహు తీవ్రమైన జాతి విద్వేష విధానాలలో, నరహంతక చర్యలలో అన్నతమ్ములుగా మారారు. ఇది మన దేశ పౌర సమాజంకు అవమానం. ఇరాన్ పై దాడిని CPI(ML)మాస్ లైన్ పార్టీ నారాయణ పేట జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. వెంటనే యుద్ధం ఆపాలని డిమాండ్ చేస్తున్నది. అంతర్జాతీయ సంస్థలు జ్యోకం చేసుకోవాలని కోరుతున్నది. నరహంతకులతో మోడీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలన్నీటిని రద్దు చేసుకోవాలని కోరుతున్నది. భారత్ లాంటి అలీన దేశం, ప్రజాస్వామిక దేశం ప్రపంచ హంతకులతో చేతులు కలుపుకోవడం దేశ ప్రజలందరినీ అవమానించడమే అన్నారు. ఈ కార్యక్రమంలో మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు చెన్నారెడ్డి డివిజన్ నాయకులు ప్రశాంత్, హాజీ మలాంగ్, నారాయణ, వెంకట్ రాములు, ఏ నరసింహ, అంజి, వెంకటేష్, సంతోష్, కథలప్ప,మైపాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *