పయనించే సూర్యుడు మార్చి 6 ఉట్నూర్ మండలం రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా ఉట్నూర్: ఉమ్మడి జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని కష్టపడి చదివి ఉన్నత స్థానాలను సాధించాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మట్ పేర్కొన్నారు గురువారం ఉట్నూరులో నిర్వహించిన యువర్ డ్రీమ్స్ మోటివేషన్ కెరియర్ గైడెన్స్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులు విద్య ద్వారానే మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చని అన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని వాటిని సాధించేందుకు క్రమశిక్షణతో శ్రమించాలన్నారు గిరిజన వసతి గృహాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు వార్షిక పరీక్షలను భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొవాలని సూచించారు. ఆత్మవిశ్వాసంతో చదివితే మంచి ఫలితాలు సాధించగలరని చెప్పారు ఉపాధ్యాయులు మరియు వార్డెన్లు కూడా విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించి పరీక్షలకు సన్నద్ధం చేయాలని సూచించారు