కుచ్చర్ కల్ లో ఘనంగా ఇఫ్తార్మతసామరస్యానికి ప్రతీకగా రంజన్

★ కాంగ్రెస్ నాయకులు సుజయ్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు, వెల్లివిరిసిన సోదరభావం ★ రంజాన్ పండుగ ప్రేమకు, త్యాగానికి చిహ్నం సుజయ్ చంద్రారెడ్డి

పయనించే సూర్యుడు మార్చి 06, మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రిపోర్టర్ నరిగె కళాశేఖర్: రాజాపూర్ మండలం కుచ్చర్ కల్ గ్రామంలో  రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుజయ్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుజయ్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. పేద, ధనిక తేడా లేకుండా,  కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండాలని, రంజాన్ పండుగ ప్రేమకు, త్యాగానికి చిహ్నమని కొనియాడారు. ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో కలిసి  వారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు .పవిత్ర మైన పండుగ క్రమశిక్షణకు, త్యాగానికి , సోదరభావానికి నిదర్శనమని,మనమంతా ఏ దేవుడిని పూజించినా చివరికి కోరుకునేది శాంతి , ప్రేమనే  అన్నారు .కుచ్చర్ కల్ గ్రామంలో ఇలా అందరం కలిసి ఇఫ్తార్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ముస్లిం సోదరురులను ఉద్దేశించి మాట్లాడారు .ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన ముస్లిం సోదరులు,  స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.