గవిగట్టు గ్రామంలో త్రాగునీటి సమస్యకు పరిష్కారం

★ గ్రామ యువ నాయకుడు ఉప్పర మునిస్వామి ఆధ్వర్యంలో

పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 05 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ పెద్దకడబూరు మండలం గవిగట్టు గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన పైప్‌లైన్ ద్వారా త్రాగునీటి సరఫరాను గురువారం ప్రారంభించారు. గ్రామ యువ నాయకుడు ఉప్పర మునిస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పైప్‌లైన్ ద్వారా గ్రామంలోని ఆరు వీధుల్లో ప్రతి ఇంటికీ త్రాగునీరు అందేలా ఏర్పాట్లు చేశారు. పైప్‌లైన్‌ను పరిశీలించి నీటి సరఫరా సక్రమంగా జరుగుతున్నట్లు ధృవీకరించారు. దీంతో త్రాగునీటి సమస్యకు పరిష్కారం లభించిందని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని వారు కోరారు.