పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 06 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ పెద్దకడుబురు మండలం బసలదొడ్డి గ్రామంలో గోడ కూలి గాయపడిన టీడీపీ కార్యకర్త హనుమంతును గురువారం ఆదోని ప్రైవేట్ ఆసుపత్రిలో టీడీపీ మండల అధ్యక్షుడు సురేష్ నాయుడు పరామర్శించారు. ఆయన హనుమంతు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, ధైర్యంగా ఉండాలని సూచించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అదే సమయంలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సులేకేరి గ్రామ కార్యకర్త బుడదొడ్డిని కూడా పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు.