గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు ఆహ్వనం

పయనించే సూర్యడు న్యూస్ టెక్కలి ప్రతి నిధి మార్చి 06 ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి, 6,7,8 తరగతులలో మిగిలివున్న ఖాళీల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవలసిందిగా గార మండలం వమరవల్లి గురుకుల విద్యాలయం ప్రధానోపాధ్యాయురాలు వై. చిట్టితల్లి ఒక ప్రకటనలో తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ కన్వీనర్ హెచ్.ఎం.డి ఉబేదుల్లా తెలియజేశారని ఆమె తెలియజేశారు. గురుకులాల్లో చేరే విద్యార్థులు మార్చి 31 లోగా ఆన్ లైన్ లో https://aprs.apcfss.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 24 వ తేదిన జరుగుతుందన్నారు.