చిన్నమోదుగుపల్లి గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం.

★ కార్యకర్తలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునాదులు. ★ జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా / జగ్గయ్యపేట నియోజకవర్గం మార్చి 6 వత్సవాయి మండలం, చిన్నమోదుగుపల్లి గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం అంగరంగ వైభవంగా జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ… గ్రామంలో సుమారు 150 మందికి పైగా వివిధ అనుబంధ విభాగాల రూపంలో పదవులు ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన వారికి ప్రతి ఒక్కరికి ఐడి కార్డు ఇస్తారు. పదవులు ఇవ్వటమే కాకుండా వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కల్పించిందన్నారు. పార్టీ కార్యకర్తలే పార్టీకి బలమని, ప్రతి కార్యకర్త కూటమి ప్రభుత్వ పథకాలు అభివృద్ధి చెయ్యి లేకపోవడం పై ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులు సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలి. సంక్షేమ పక్షపాతి వారి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాడు పాలన ఎలా ఉందో చూసాం, నేడు పాలన ఎలా ఉందో కళ్ళ ఎదుట చూస్తున్నాం. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ అని చెప్పి యువతకి నిరుద్యోగ భృతి అని 3000 భరోసా కల్పిస్తామని ఇప్పటి చెయ్యలేదు. ఎస్సీ ఎస్టీ మహిళలకు 50 ఏళ్లు దాటితే వారికి పెన్షన్ ఇస్తానని చెప్పి ఇప్పటికి కల్పించలేదు ఏ పింఛన్లు ఇవ్వలేని దౌర్భాగ్య ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని దుయ్యబట్టారు. నాడు వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే కులం మతం చూడకుండా పెన్షన్ ఇప్పించే కార్యక్రమం చేశారు అని చేశారు గుర్తు చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ తిరుపతి లడ్డు అని పిచ్చిపిచ్చి మాటలతోటి ఏదేదో మాయాజాలతో మాట్లాడుతున్న పిచ్చి ప్రభుత్వం పేర్కొన్నారు. త్వరలో ఏ ఎన్నికలు వచ్చిన కార్యకర్తలు, నాయకులు అందరూ సిద్ధంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గూత్తా శంకర్రావు, గ్రామ పార్టీ అధ్యక్షులు మార్తి రామకృష్ణ, గ్రామ సర్పంచ్ నెలవెల్లి వెంకటప్పయ్య, నెలవెల్లి రమణయ్య, జడ్పిటిసి సభ్యులు యేసుపోగు దేవమణి శ్రీనివాసరావు, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, జిల్లా పంచాయతీ రాజ్ కార్యదర్శి శీలం మంగారావు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.