డిండి లొ స్వపరిపాలన దినోత్సవ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

పయనించే సూర్యుడు మార్చ్ 6 ( ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని పిఎం శ్రీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదర్శ పాఠశాల మరియు కళాశాల లో గురువారం నాడు స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విధ్యార్థులు ఉపాధ్యాయులు గా విధులు నిర్వహించారు. ప్రిన్సిపాల్ గా రమ్యశ్రీ, ఏంఇఓ గా మహేశ్వరి, డిఇఓ గా సాయి శ్రేయ, ఏడి గా స్పందన, జేడీ గా నిశిత, ఎమ్మార్వో గా అనూష, ఎంపిడిఓ శ్రావ్య, ఎంపీ గా అక్షిత, ఎమ్మెల్యే గా ఆకాంక్ష, విద్యా శాఖ మంత్రి గా ముజాంబిర్, విధులు నిర్వహించారు.ప్రిన్సిపాల్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఉపాధ్యాయుల బోధన ఎంత గొప్పదో అర్థమయ్యిందని, తక్కువ సమయంలో వాళ్ల విధులు చక్కగా నిర్వహించారని అన్నారు. విధ్యార్థులు వాళ్ల అనుభవాన్ని పంచుకుంటూ ఉపాధ్యాయులు ప్రతిరోజూ ఎంతో శ్రమకోర్చి మమ్మల్ని భరిస్తున్నారని తెలిపారు.ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి, చింత బిచ్చయ్య,రమా, సుశీల, రాచమల్ల వెంకటేశ్వర్లు, నారిమల్ల ఎన్ విజయ్ కుమార్, పులి కోదండ రామారావు, ఇమ్మడి చెన్నయ్య, గోరటి సోమయ్య, పి.రవి, కొప్పు బాలకృష్ణ, వి.విజయ్, శ్రీను శ్రీలత, ధనలక్ష్మి, రుంషా, పి.రాజు, వి.రమేష్, పిడి రవి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *