పయనించే సూర్యుడు మార్చి 6 కరీంనగర్ న్యూస్: విలాసాగర్ గ్రామ అంగన్‌వాడీ టీచర్ దొబ్బల లక్ష్మి కుమార్తె మనీష-పర్షరాం వివాహానికి హాజరైన గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య మాట్లాడుతూ నిండు నూరేళ్లు పిల్లాపాపలతో చల్లగా ఉండాలని ఆశీర్వదించినారు సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ పొత్తురి శైలజ రాజు మరియు పాలకవర్గ సభ్యులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు ఏనుగుల ప్రశాంత్ కుమార్ మార్కెట్ డైరెక్టర్ కళ్లేపెల్లి సతీష్,వార్డు సభ్యులు దమ్మ వెంకటరమణ,జోగు శంకర్, సుంకపాక అనిల్, కుల పెద్దమనుషులు కొంకటి మధు, మాజీ ఎంపీపీ మధు మరియు గ్రామ ప్రజలు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు