నాగర్ కర్నూల్ జిల్లా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ కొత్త కమిటీ ఏర్పాటు

* జిల్లా అధ్యక్షులుగా మంగి ఆంజనేయులు. ఉపాధ్యక్షులు వర్కాల భాను ప్రకాష్.సెక్రటరీ బోనాసిరాజు

పయనించే సూర్యుడు మార్చి 6 నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లాకు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ (ఐహెచ్ఆర్వో) జిల్లా కమిటీని గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి. అఫ్జల్ మరియు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవంచ సాల్వాచారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా మంగి ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షుడిగా వర్కాల భాను ప్రకాష్, కార్యదర్శిగా బోనాసి రాజును ఎన్నుకున్నారు. అలాగే ఇతర కమిటీ సభ్యులను కూడా ఎంపిక చేశారు. కమిటీ ఏర్పాటైన అనంతరం కొత్తగా ఎన్నికైన సభ్యులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి. అఫ్జల్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవంచ సాల్వాచారిని శాలువాలతో సత్కరించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన మరియు ప్రజల హక్కుల కోసం పనిచేయడం ఐహెచ్ఆర్వో సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. జిల్లాలో ప్రజలకు మానవ హక్కులపై అవగాహన కల్పించడం, అన్యాయానికి గురవుతున్న వారికి సహాయం చేయడం, సమాజంలో సమానత్వం మరియు న్యాయం స్థాపనకు కృషి చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి సంస్థ సభ్యులు మరియు స్థానిక ప్రముఖులు హాజరై కొత్త కమిటీకి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి. అఫ్జల్ గారు ఆవంచ సాల్వాచారికి వ్యక్తిగత డైరీని జ్ఞాపకంగా అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *