పాఠశాలకు సౌండ్ సిస్టం వితరణ

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మార్చి 06 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలం భూపతిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పనిచేయుచున్న ఉపాధ్యాయులందరూ జాతీయ పండగలకు , పాఠశాల లో నిర్వహించే కార్యక్రమాలకు మైకు సెట్ కు సంబంధించి 10వేలు విలువచేసే 2రెండు సౌండ్ సిస్టమ్ బాక్సులను స్థానిక గ్రామ సర్పంచ్ శ్రీమతి గుర్రం భావన మహేందర్ చేతుల మీదుగా పాఠశాలకు అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం భావన మహేందర్, జక్కుల చంద్రశేఖర్, మహేందర్ గౌడ్, ముత్యంరెడ్డి, జక్కుల రాజేంద్ర ప్రసాద్ మరియు ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు బొల్లె చిన్నయ్య ఉపాధ్యాయులు శంకరయ్య, సత్యనారాయణ, సహబజ్ హుస్సేన్, సంజయ్ కుమార్, వేణుగోపాల్, సురేష్, పుష్పలత, భవాని, శైలజ,వంశీధర్ రావు పాల్గొన్నారు