పార్థివ దేహానికి నివాళులర్పించిన వున్నం బ్రహ్మయ్య

పయనించే సూర్యుడు న్యూస్ 06. మార్చి 2026 నేలకొండపల్లి మండలం రిపోర్టర్ సామల రామకృష్ణ పైనంపల్లి గ్రామానికి చెందిన కీ॥శే తాళ్లూరి అంజయ్య, అదే గ్రామానికి చెందిన పెడల్లి రుక్మిణమ్మ గారు అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న నేలకొండపల్లి పార్టీ అధ్యక్షులు వున్నం బ్రహ్మయ్య ఈ రోజు వారి నివాసానికి వెళ్లి వారి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబాన్ని ఓదార్చి సానుభూతి వ్యక్తం చేశారు… ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మండల పార్టీ నాయకులు కోనాయిగూడెం సర్పంచ్ కోటి సైదారెడ్డి, తిరుమాలపురం సర్పంచ్ కమదన ప్రవీణ్, మండల నాయకులు పాపినేని వెంకటనారాయణ,దాసరి ఉదయ్, సిద్దయ్య, పద్మారావు, మోహ లాల్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *