పి జి ఆర్ ఎస్ లో ఫిర్యాదు చేసిన పట్టించుకోని అటవీశాఖ అధికారులు..

పయనించే సూర్యుడు మార్చి 6, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) ఎన్నో వ్యవప్రయాసలకోర్చి కలెక్టర్ కార్యాలయంలో పిర్యాదులు ఇస్తుంటే కొన్ని శాఖల అధికారులు పిర్యాదులను అధిóకారులనుండి తీసకుని ఆన్‌లైన్ చేయకుండా పట్టుకుపోతున్నారు. కాకినాడరూరల్ మండలం రమణయ్యపేట పంచాయితీ పరిదిలో ఏపిఐఐసి పార్కులో ఓఎన్‌జిసి కంపెనీ విడుదల చేసిన సుమారు 10లక్షల రూపాయల సిఎసఆర్ నిధులతో మొక్కల నిర్వహణ విషయంలో గోల్‌మాల్ జరిగిందని, దీనిపై పూర్తి విచారణ జరిపి అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని మార్చి 2వ తేదీని పిజిఆరఎస్‌లో పిర్యాదు నెంబర్ (165)చేయడం జరిగింది. దీనిపై పిజిఆరఆస్ అధికారి అటవీ శాఖ అధికారి సుబానిని పిలిచి వివరణ అడుగగా పిర్యాదు దారులు అటవీ శాఖ కార్యాలయానికి వస్తే వివరాలు ఇస్తామని చెప్పినా రాకుండా పిజిఆరఎస్‌లో పిర్యాదు చేసారని అధికారికి తప్పుడు సమాధానం చెప్పడం జరిగింది. దీనిపై పిర్యాదు దారుడు ఇప్పటికే దీనిపై వార్తా పత్రికలో రెండు సార్లు కధనాలు రాయడం జరిగిందని, అయినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి వివరాలు ఇవ్వలేదని పిజిఆరఎస్ అధికారికి చెప్పడంతో సిఎసఆర్ నిధుల గోల్‌మాల్‌పై వెంటనే వివరణ ఇవ్వాలని పిజిఆరఎస్ అధికారి అటవీ శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది. దీంతో పిర్యాదు దారునుకి వివరాలు చెబుతామని పిజిఆరఎస్ పిర్యాదును తీసుకుని పట్టుకుపోయారే తప్ప ఇప్పటివరకు కనీసం ఆన్‌లైన్ కూడా చేయలేదు. పిజిఆరఎస్‌లో వచ్చిన ప్రతి పిర్యాదును ఆన్‌లైన్ చేస్తామని, పిర్యాదు దారునికి తప్పనిసరిగా న్యాయం చేస్తామని చెబుతున్న అధికారులు ఏం చేస్తున్నట్లో అర్దం కావడంలేదు. పిర్యాదు దారుడ్ని పక్కదోవ పట్టించిన అటవీ శాఖ అధికారులపై తీరుపై జిల్లా కలెక్టర్‌కు పిర్యాదు చేయనున్నారు.