పుట్టినరోజు సందర్భంగా అగాపే ఆశ్రమంలో అన్నదానం.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 6 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి మండలము, కమలపాడు రోడ్డు ,రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో వేములపాడు లో నివాసముంటున్న పులి గంగన్న, భార్య గంగ రత్నమ్మ , కుమారులు రాజు,షాలేం వీరి కుటుంబము, పెద్ద కుమారుడు రాజు 20వ పుట్టినరోజు శుభ సందర్భంగా ఆశ్రమంలో వృద్ధులకు ,నిరాశ్రయులకు భోజనాల సిద్ధపరిచి ఆశ్రమంలో ఉంటున్న వారందరికీ అన్నదానం చేశారు. రాజుతో పాటు కుళ్లాయి,కుట్టీ, రాంబాబు చిన్నపిల్లలు కూడా వచ్చారు. ఆశ్రమంలో ఉంటున్న వారంతా కూడా రాజుకి శుభాకాంక్షలు తెలియజేసి ఆ కుమారుని ఆశీర్వదించారు. ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలోని వారంతా వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.