పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 06 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ పెద్దకడబూరు, జాలవాడి గ్రామాల్లో బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులు పంపిణీ చేశారు. గురువారం వైయస్ఆర్‌సీపీ గ్రామ నాయకులు, మాజీ వలంటీర్ దయ్యాల షాబీర్ భార్యకు రూ.20,484 రూపాయలు, వడ్డే సునీతకు రూ.30,028 రూపాయలు చెక్కులు అందించారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు పార్టీలకతీతంగా పేద ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర రైతు అధికారి ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నరవ శశిరేఖ, మీసేవ ఆంజనేయ మైనార్టీ నేతలు కటిక మహబూబ్ బాషా, జాలవాడి నాయకులు ముక్కన్న మునియప్ప పాల్గొన్నారు.
