పెళ్లి కానుకగా పదివేల నూటపదహారు అందించిన గ్రామ సర్పంచ్

★ డిండి మండలం, కుందేలు బాయ్ తండ సర్పంచ్ వెంకట్ రామ్

పయనించే సూర్యుడు డిండి మార్చ్ 6 (ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) డిండి మండలం కుందేలు బాయ్ తండా గ్రామ పంచాయతీ లో ఏ ఆడపిల్ల పెళ్లి అయినా పెళ్లి కానుకగా పదివేల నూటపదహారు రూపాయలు అందిస్తామని కుందేలు బాయ్ తండా గ్రామ సర్పంచ్ కాట్రావత్ వెంకట్ రామ్ అన్నారు అదేవిధంగా కుందేలు బావి తండా గ్రామపంచాయతీలో ఏ వ్యక్తి మరణించిన ఆర్థిక సహాయంగా పదివేల రూపాయలు అందజేస్తామని గ్రామ సర్పంచ్ వెంకట్ రామ్ అన్నారు ఈరోజు ఉమ్మడి గ్రామపంచాయతీ అయినటువంటి దేవుని గుడి తండాలో మూడవత్ మూడవత్ రుక్మిణి సేవ్య దంపతుల కుమార్తె మూడవత్ సింధు వివాహానికి పెళ్లి కానుకగా పదివేల నూట పదహారు రూపాయలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మూడవత్ బాలు ముద్రిస్ గుండ్యా మూడవ నిరంజన్ రాత్లావత్ లక్ష్మ మూడవ దాసు ముద్రిస్ హన్మ తదితరులు పాల్గొన్నారు