ప్రజలు వ్యతిరేకిస్తున్న రంగురాళ్ల మైనింగ్ ఎందుకు.

★ ప్రజా అభిప్రాయ సేకరణకు విరుద్ధంగా ఏజెన్సీలో మైనింగ్ రాజ్యాంగ విరుద్ధం.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి. 06.2026 రాష్ట్ర అధ్యక్షులు కాకి మధు. గురువారం నాడు కొయ్యూరు మండలం బక్కులూరు గ్రామంలో రంగురాళ్ల క్వారీనీ వ్యతిరేకిస్తూ స్థానిక ఆదివాసి ప్రజలు మైనింగ్ సంబంధించిన వాహనాలను అడ్డుకోవడం జరిగింది. అక్కడ పోలీస్ సహకారంతో మైనింగ్ కాంట్రాక్టర్లు ముందుకు పోయే ప్రయత్నం చేస్తుండగా, ఆదివాసి ప్రజలు శాంతియుతంగా ప్రతిఘటిస్తున్నారు. దీనిపై ఆదివాసి సంక్షేమ పరిషత్ స్పందిస్తూ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం బక్కులూరు పంచాయతీ పరిధిలో నిర్వహించబోతున్న రంగురాళ్ల మైనింగ్ పై అక్కడ స్థానిక ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారని,ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగంలో రాజ్యాంగంలోని పేర్కొన్న ఆర్టికల్ 244 అనుసరించి స్థానిక స్వయంపాలన అనగా పీసా నిబంధనలకు విరుద్ధంగా రంగురాళ్ల మైనింగ్ కి లీజు ఇవ్వటం చట్ట విరుద్ధం అని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు కాకి మధు ఆవేదన వ్యక్తపరిచారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసి ప్రజలకు అనుగుణంగా ఆదివాసి ప్రజలే స్వయం పరిపాల నిర్ణయ అధికారాలను కల్పించిన పిసా చట్టంను పాలకులు ప్రభుత్వాలు తుంగలోకి తొక్కి, పోలీస్ నిర్బంధంతో ఆదివాసులను అణిచివేయాలని చూస్తున్నారని, రంగురాళ్ల క్వారీ వాళ్ళ జరుగుతున్న నష్టం గురించి రైతులు స్థానిక ప్రజలు భయాందోళనలో ఉన్నారని, ప్రజల పక్షాన ఆదివాసి సంక్షేమ పరిషత్ ఉద్యమం చేయటానికి సిద్ధంగా ఉందని ప్రభుత్వం ఇప్పటికైనా లీజును రద్దు చేయకపోతే స్థానిక తప్పు తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. గురువారం నాడు పోలీస్ నిర్బంధంతో ప్రజలను బెదిరించి రంగురాళ్ల క్వారీని ప్రారంభించాలని ప్రయత్నంలో భాగంగా ఆదివాసీలను బెదిరింపులకు గురి చేయటం సరికాదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. కాకి మధు ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు.