ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

* బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ డిమాండ్

పయనించే సూర్యుడు, మార్చి 06 ధర్పల్లి మండల్ రిపోర్టర్ సురేందర్ దర్పల్లి : మండలంలోని హోన్నజీపేట గ్రామములో దళితుదైనా ప్రభుత్వ ఉద్యోగిపై అగ్రకులస్థుడైన జీవన్ రెడ్డి, వారి కులస్థులు చేసిన దాడిని నిరసిస్తూ గురువారం రాష్ట్ర బిసి, ఎస్సి, ఎస్టీ జేఎసీ తరపున దర్పల్లి సిఐ భిక్షపతి, ఎస్ఐ సామ శ్రీనివాస్ లకు వినతి పత్రము అందించారు. ఈనెల 2వ తేదీన బాధితుడు పాఠశాల ఊధ్యాయుడు గద్దల నరేందర్ తన విధులు ముగించుకొని ఇంటికి ప్రయాణం చేస్తుండగా మార్గ మధ్యలో హోన్నజీపేట గ్రామస్థుడైనా జీవన్ రెడ్డి కు అనుకోకుండా ప్రమాదవషత్తు చిన్నపాటి ప్రమాదం జరిగింది. దింతో జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులు తీవ్రంగా కొట్టి పరుశపదజాలం వాడుతున్న ఇష్టం వచ్చినట్లు చితకబాధడంతో, బాధితుడు అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికి పోలీసులు ఇప్పటికి నాల్గు రోజులు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని రాష్ట్ర నాయకులు ఆగ్రహం వెక్తం చేశారు. దింతో నేటి రోజు పోలీసు అధికారులకు తాము మెమోరాండం అందించడం జరిగిందని అన్నారు. బాధితునిపై చెయ్యి చేసుకున్న వెక్తులపై అట్రాసిటీ, కేసు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు. చిన్నపాటి ప్రమాదమనే సాకుతో అగ్రకులస్థులకు కాపాడే ప్రయత్నం పోలీసులు చేస్తే జిల్లా వ్యాప్తంగా తమ ఆందోళన తీవ్రం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో BC, SC, ST-JAC రాష్ట్ర నాయకులు ప్రేమ్ కుమార్,జిల్లా ఇంచార్జ్ మహిపాల్, జిల్లా నాయకులు బాలయ్య ముదిరాజ్, సుభాష్, మురళి, ఉమేష్, ధర్పల్లి మండల అధ్యక్షులు మహిపాల్ ముఖ్య నాయకులు, ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *