పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 6 బోధన్ :బోధన్ పట్టణంలోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు.బోధన్ లోని విజేత, ఉషోదయ, విద్యా వికాస్, జూనియర్ కాలేజీలలో కొనసాగుతున్న పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో అందుబాటులో ఉన్న తాగునీరు, టాయిలెట్స్ వంటి సౌకర్యాలను పరిశీలించారు. సీసీ కెమెరా నిఘాలో పరీక్షలు జరుగుతున్నాయా లేదా అని గమనించారు. పలు కేంద్రాలలో లోపాలను గమనించిన కలెక్టర్ సంబంధిత అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బోధన్ పట్టణంలోని అన్ని పరీక్షా కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి తనకు వివరాలు తెలియజేయాలని డీ.ఐ.ఈ.ఓ రవికుమార్ ను ఆదేశించారు.