ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన జిల్లా యూత్ మాజీ అధ్యక్షులు కోడిదల రాము

* నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చ

పయనించే సూర్యుడు మార్చి 6 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ను నాగర్ కర్నూల్ జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కోడిదల రాము మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులు మరియు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అలాగే జిల్లాలో పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం మరియు రాబోయే రాజకీయ పరిణామాలపై కూడా చర్చించినట్లు తెలిసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి సమర్థవంతంగా చేరుతున్నాయని వివరించిన కోడిదల రాము, పార్టీ కార్యకర్తల తరపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి మరింత సహకారం అందించాలని కోడిదల రాము ముఖ్యమంత్రిని కోరినట్లు సమాచారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *