యుద్ధం వద్దని ఆత్మకూరులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ

పయనించే సూర్యుడు మార్చి 6 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాన్ని నిలుపుదల చేయాలని ప్రపంచ శాంతిని కోరుతూ ఆత్మకూరులో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని యుటిఎఫ్ కార్యాలయం ప్రాంతం నుండి మున్సిపల్ బస్టాండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. యుద్ధకాంక్ష ఉన్న అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని ప్రపంచ శాంతి కోసం యుద్ధం వద్దని శాంతి కావాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పట్టణంలోని సిపిఎం, సిఐటియు, ఉపాధ్యాయ సంఘాలు తో పాటు పలు ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.మున్సిపల్ బస్టాండ్ వరకు సాగిన ఈ ర్యాలీ బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వక్తలు ప్రసంగించారు. ప్రపంచ శాంతిని కోరుతూ ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం తీవ్రతరమైతే మూడో ప్రపంచయుద్ధంగా మారే అవకాశం ఉందని దీనిని వెంటనే నిలుపుదల చేస్తూ శాంతిని కోరుకోవాలని అందుకు ఐక్యరాజ్యసమితి మరియు ఇతర దేశ ప్రధానులు ప్రయత్నం చేయాలంటూ వీరు కోరారు. యుద్ధం వల్ల ప్రపంచ దేశాలపై ఆర్థిక ప్రభావం చూపిస్తుందని దేశంలోని అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతాయని ఇది సామాన్య ప్రజలకు తీరని నష్టం అంటూ ఆపే చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు శివప్రసాద్, సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు, సిఐటియు హాజరతయ్యా, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సందాని, ఐద్వా సంఘం మహిళా నాయకురాలు గుల్జార్ బేగం, ఇందిరా,జనవిజ్ఞాన వేదిక శ్రీనివాసులు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు