పయనించే సూర్యుడు మార్చి 06, మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రిపోర్టర్ నరిగె కళాశేఖర్: రాజాపూర్ మండల నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన రాజశేఖర్‌ను మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సర్పంచ్‌లు ఘనంగా సన్మానించారు. గురువారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మేకల శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో ఎస్ఐకి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిరంతరం కృషి చేయాలని, ప్రజలకు ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉంటూ సహకరించాలని కోరారు. ఇందుకు ఎస్ఐ రాజశేఖర్ స్పందిస్తూ.. మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూస్తామని, ప్రజల సహకారంతో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మేకల శ్రీశైలం యాదవ్ సర్పంచ్ లు వెంకటయ్య గౌడ్, మీనా శేఖర్ గౌడ్, గాయత్రి మల్లేష్ గౌడ్, బంగారి సంతోష వెంకటేష్, హతీరం, ఆంజనేయులు, నర్సిములు, లింగం, గణేష్, మల్లేష్, శ్రీను నాయక్, రమేష్ నాయక్, శేఖర్, నర్సిములు, తదితరులు పాల్గొన్నారు.