పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి /06: నియోజకవర్గం స్టాప్ రిపోర్టార్ :సాయిరెడ్డి బొల్లం :మానకొండూర్ నియోజకవర్గం టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షులు.ఎమ్మెల్యే కవ్వం పెళ్లి సత్యనారాయణ తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థులుగా ఖరారైన సిటింగ్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షులు, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వం సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. అంతే కాకుండా గురువారం వారు హైదరాబాదులో నామినేషన్లు దాఖలు చేయగా, ఈ కార్యక్రమంలోనూ రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రభృతులతో కలిసి డాక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు.