రెడీమిక్స్ లారీ డ్రైవర్ లకిరావలసిన వేతనం ఇప్పించిన”రాష్ట్రశ్రమశక్తి అవార్డు గ్రహీత రవి

పయనించే సూర్యుడు, మార్చి 06 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) పటాన్ చెరువు నియోజకవర్గంలోని బొల్లారం ఇండస్ట్రీ ఏరియా "విజయవా డ, అమరావతి, కాంక్రీట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రెడీమిక్స్ కంపెనీ"లో ఓనర్ రామచందర్ దగ్గర డ్రైవర్ లుగా ప్రశాంత్, తహిర్, అన్సారీ, డ్రైవర్ లు గత కొన్ని సంవత్సరాలుగా పని చేయడం జరుగుతుంది… ఏమి కారణం లేకుండా ముగ్గురినీ లారీ ఓనర్ రామ్ చందర్, డ్రైవర్ లనీ డ్యూటీలో నుంచి తీసివేయడం జరిగింది… రెడీ మిక్స్ డ్రైవర్ లకి ఒక్కొక్కరికి 16000/- వేల రూపాయలు రావాల్సి ఉండగా గత సంవత్సరం డిసెంబర్ నెల, వేత్తనం ము గ్గురికి కలిపి మొత్తం 48000/- వేల రూపా యలు రావాల్సి ఉండగా డబ్బు లు ఇవ్వకుండా, ఏదో రకంగా నిర్లక్ష్యం చేస్తూ డ్రైవర్ లని ఇబ్బంది పెడుతూ పంపించేవాడు, ముగ్గురు రెడీమిక్స్ డ్రైవర్ లకి ఏం చేయాలో అర్ధం కాక ఎవరైతే మనకు న్యాయం చేస్తారో అని తోటి డ్రైవర్ల ద్వారా తెలుసుకొని బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి అతని గురించి తెలు సుకొని రవి కార్యాలయం వద్దకు వెళ్లి డ్రైవర్ లకి జరిగిన అన్యాయం చెప్పుకు న్నారు,ఆ తర్వాత వెంటనే స్పందించిన, రవి హుటాహుటిన, "రెడీమిక్స్ ఓనర్ రామచంద్రరావు, దగ్గరికి వెళ్లి డ్రైవర్ లకు ముగ్గురికి రావలసిన వేతనం గురించి పలుమార్లు చర్చించి, డ్రైవర్ లకి మొత్తం డిసెంబర్ ఒక్క నెల వేతనం ఒక్కొక్కరికి 16000/- వేల రూపాయలు రావాల్సి ఉండగా ముగ్గురికి కలిపి మొ త్తం 48,000/- రూపాయలు ఇప్పించడం జరిగింది… డ్రైవర్ లు ప్రశాంత్, తాహిర్, ఆన్సరీ, మాట్లాడుతూ మాకు న్యాయం చేసిన కార్మిక నాయకుడు రవి కి మా తరపున, మా కుటుంబ సభ్యుల తరఫు న ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు… ఈ కార్యక్ర మంలో అనిల్, సుదర్శన్, జగన్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు..