పయనించే సూర్యడు మార్చి 06 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలో గురువారం జరిగిన వివాహ వేడుక సందడి నెలకొంది. గ్రామానికి చెందిన కూరాకుల నాగేశ్వరరావు కుమారుడు వినోద్ - నాగేశ్వరి ల వివాహ మహోత్సవానికి కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నవ దంపతులను ఆశీర్వదించిన మల్లయ్య యాదవ్, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పెళ్లి కుమారుని కుటుంబ సభ్యులు ఆయనకు సాదర స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంట పలువురు బిఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు అనంతుల ఆంజనేయులు పోలంపల్లి వెంకటేశ్వర్లు (బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు)పోలంపల్లి వీరబాబు నాగేశ్వరరావు కాసాని శీను కూరాకుల కృష్ణమూర్తి కన్నబోయిన వెంకన్న శీను (తెల్లబెల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు)వీరితో పాటు పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.