శ్రీ సాయి చైతన్య పాఠశాలలో రోబో విజన్ ఏ ఐ ఎక్స్పో

పయనించే సూర్యుడు మార్చ్ 6 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా( రిపోర్టర్ జిన్న అశోక్) మండల కేంద్రమైన శ్రీ సాయి చైతన్య ఉన్నత పాఠశాల ప్రాంగణంలో చైతన్య రోబో విజన్ ఎగ్జిబిషన్ విగ్రాం శ్రీకర్ గౌడ్ ఆధ్వర్యములో ఈ ఎగ్జిబిషన్ ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగ సీఐ రేణుఖ మేడం డీఈవో విజయ మేడం ఎంఈఓ శేఖర్ సార్ ఎక్స్ ఎం ఈ ఓ వెంకటేశం శ్రీనివాస్ సార్ మరియు శ్రీనివాస్ రావు ముఖ్య అతిధులుగా చైతన్య రోబోవిజన్ -1కు విచ్చేసి వారందరూ వారి అభిప్రాయాలను తెలియజేస్తూ పెద్దశంకరపేట మండలంలో మొట్టమొదటి సారిగా ఈ రోబో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ఎంతో గర్వంగా ఉందని మారుతున్న కాలాన్ని బట్టి పిల్లల భవిష్యత్తుకు ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందని అలాగే విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని వారు ఎంతగానో ప్రోత్సహించారు ఇప్పటివరకు సైన్స్ కు సంబంధించిన ఎగ్జిబిషన్స్ చూశాము కానీ ఏ ఐ ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే ఈ ఎగ్జిబిషన్ ఎంతో సక్సెస్ని సాధించినదని విచ్చేసిన అతిథులు తల్లిదండ్రులు విద్యార్థులు పెర్కొన్నారు ఈ చైతన్య రోబోవిజన్ కు శంకరపేట గ్రామంలోని పాఠశాలలే కాకుండా నారాయణకేడ్ ప్రాంతం నుంచి కూడా పాఠశాలలు రావటం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవనీయులైన విగ్రాం గంగాధర్ గౌడు మరియు విగ్రాం భూమేశ్వర్ గౌడ్ విగ్రాం శ్రీకర్ గౌడ్ విగ్రాం అనిరుద్ గౌడ్ మరియు ఇంచార్జ్ పీటర్ జాన్సన్ సార్ మరియు రసజ్ఞ మేడం మరియు రోబోటిక్ ట్రైనర్స్ చరణ్ అలేఖ్య మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *