పయనించే సూర్యుడు, మార్చ్ 6, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. గోపాల్ నగర్ గ్రామ సర్పంచ్ పేరబోయిన కళ్యాణి పరుశురాములు 20 లక్షల ఈజీఎస్ నిధులతో సిసి రోడ్ల ఏర్పాటుకు ముందడుగు వేశారు. సిసి రోడ్డు నిర్మాణానికి గ్రామ ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ ,బిఆర్ఎస్, సీపీఎం నాయకులు, మహిళలతో కలిసి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం ప్రధాన లక్ష్యమని అన్నారు. గ్రామ అభివృద్ధి కోసం సహకరించాలని, గ్రామానికి అత్యధిక నిధులు రావడానికి తమ వంతు కృషి చేస్తున్నామని, గ్రామంలో మట్టి రోడ్డు లేకుండా సిసి రోడ్లతో అద్దంలా మెరిసేటట్టుగా చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలు ఎప్పటికి అప్పటికి తెలుసుకొని పరిష్కారం మార్గం చూపుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చింతల కర్ణాకర్, వార్డు మెంబర్లు జానీ, గంగరబోయిన ఐలయ్య, వద్ధి క్రాంతి, మహాలక్ష్మి సుభాష్, మాజీ సర్పంచ్ పర్వతం మధు ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గణపురం నాగేష్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గుర్రపు రమేష్,వల్లాల సత్యనారాయణ, బొమ్మెన నర్సింలు, పస్తం పోశయ్య, పర్వతం నర్సింలు,పస్తం రమేష్, వద్ది మల్లయ్య,, సిరిపాటి సాయి తదితరులు పాల్గొన్నారు.