10 8 మరియు 102 అత్యవసర సేవలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రోగ్రాం మేనేజర్ మరియు డిస్ట్రిక్ట్ మేనేజర్.

పయనించే సూర్యుడు న్యూస్, మార్చ్ 6, 2026, వాంకిడి, ఝాడే భక్త రాజ్, ప్రతినిధి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ మరియు 108 డిస్ట్రిక్ట్ మేనేజర్ మెరుగు నరేష్ యాదవ్ 102,108 అందిస్తున్న సేవలను ఆకస్మికంగా తనిఖీ చేసి అందులో ఉన్నటువంటి మెడికల్ స్టాక్ మరియు మెడికల్ ఎక్విప్మెంట్స్ వర్కింగ్ కండిషన్ రికార్డ్స్ చెక్ చేసి అదేవిధంగా వేసవికాలంలో వడదెబ్బ కేసులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున అన్ని అంబులెన్స్లలో డ్రగ్ చిల్లెర్స్ ఐస్ ప్యాక్స్ మెయింటైన్ చేయాలని సూచించారు. మరియు 102 అంబులెన్స్ ద్వారా .మండల ప్రజలకు అందిస్తున్నటువంటి సేవలు గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా కాల్ వచ్చిన వెంటనే అంబులెన్స్ తొందరగా బయలుదేరాలని సిబ్బందికి తగిన సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 108 మెడికల్ టెక్నీషియన్ ప్రవీణ్, అమృత రావు పైలెట్ భీమ్రావు, రమేష్ 102 పైలట్ సీతారాం, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *