99 రోజుల కార్యాచరణ పై ప్రత్యేక సమావేశము

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 6 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక లో భాగంగా తెలంగాణా ప్రభుత్వము మునిసిపాలిటీ లలో చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక పై గురువారం చైర్ పర్సన్ జూపల్లి శశికళ అధ్యక్షతన కౌన్సిలర్ల ప్రత్యేక సమావేశం జరిగినది. ఈ సమావేశములో మునిసిపల్ కమీషనర్ బి. నాగరాజు మాట్లాడుతూ 99 రోజుల ప్రణాళిక లో భాగంగా మార్చ్ 6 నుండి ఈ నెల 15 వరకు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సూచించారు. 10 రోజుల పాటు నిర్వహించే పరిశుభ్రత కార్యక్రమాలలో ప్రధానంగా ఇంటింటికీ వెళ్లి తడి పొడి చెత్త సేకరణ, మురికి కాలువల పూడికతీత తో పాటు, పలు కార్యక్రమములు నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేసి అమలు చేయనున్నట్లు కమీషనర్ తెలిపారు. అందుకు ప్రజలను అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములను చేసి చైతన్యం నింపాలని కౌన్సిలర్లకు సూచించారు. ఈ కార్యక్రమములో వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబుతో పాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *