పయనించే సూర్యుడు, మార్చి 07 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) శుక్రవారం రోజు మియాపూర్ 240 డివిజన్, ప్రగతి నగర్ లోని నీలిమా హైట్స్ అపార్ట్మెంట్స్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించు కొని ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ప్రముఖ సామాజిక సేవకుడు అట్టేపల్లి రామప్రభు వారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ అపార్ట్‌మెంట్ మహిళలు మరియు పిల్లలు ఉత్సా హంగా పాల్గొన్నారు. మహిళల కోసం వినోదాత్మక ఆటలు నిర్వహించారు.అందులో మ్యూజికల్ ఛైర్స్,ప్రొటెక్ట్ యువర్ బెలూన్,ఫిల్ ద వాటర్ బాటిల్,తగ్ ఆఫ్ వార్ వంటి ఆటలు నిర్వహించి మహిళలను ఆనందపరిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలం దరికీ ప్రోత్సాహక బహుమతులు ప్రక టించారు. అలాగే మొదటి బహుమతి 5,000 రూపాయలు అలాగే రెండో బహుమతి 3,000 రూపాయల విలువచేసే గిఫ్ట్ ప్రకటించడం విశేషం ఈ సందర్భంగా అట్టేపల్లి రామప్రభు మాట్లాడుతూ…మహిళలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. వారికి గౌరవం ప్రోత్సాహం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు, పిల్లలు, నివాసితులు ఏ. ఆర్. పి. టీం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్య క్రమాన్ని విజయవంతం చేశారు.