అనారోగ్యంతో ఉన్న జాన్ పాల్‌ను పరామర్శించిన మాజీ మంత్రి విడదల రజిని..

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 7 యడ్లపాడు మండల ప్రతినిధి.. యడ్లపాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు కొప్పుల జాన్ పాల్ ఇటీవల అనారోగ్యానికి గురైన నేపథ్యంలో శుక్రవారం తిమ్మాపురం గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి మాజీ మంత్రి విడదల రజిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని వివరంగా అడిగి తెలుసుకుని, త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజల మధ్య ఎల్లప్పుడూ చురుకుగా ఉండాలని, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. జాన్ పాల్ త్వరగా కోలుకుని మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని మాజీ మంత్రి రజిని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కూడా జాన్ పాల్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యడ్లపాడు మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు వడ్డేపల్లి నరసింహారావు, యడ్లపాడు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు మాథ్యూ సాగర్, స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *