అన్నారుగూడెంలో ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాలు..

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 7,తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక, ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక హైస్కూల్లో ఈ వారోత్సవాలను సర్పంచ్ గొడ్ల ప్రభాకర్, ఉపసర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వర్లు(కెవి) చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ వెంకటేశ్వర్లు, వార్డు మెంబర్ సూదా హనుమంతరావు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *