ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేద కుటుంబాలకు అండగా ప్రజా ప్రభుత్వం

★ నూతన గృహాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన విలాసాగర్ సర్పంచ్ ఏనుగుల కనకయ్య

పయనించే సూర్యుడు మార్చి 7 కరీంనగర్ న్యూస్: విలాసాగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి పథకం ద్వారా నిర్మించిన ఇంటికి నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు, నిరుపేదలకు సొంత ఇల్లు కలను నిజం చేస్తూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇంటి పథకం ద్వారా గ్రామానికి చెందిన వేదిర స్వప్న–పర్శరాం కుటుంబం తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకున్నారు, ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య, ఉపసర్పంచ్ పొత్తూరి శైలజ–రాజు ఆధ్వర్యంలో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు, ఈ సందర్భంగా జరిగిన గృహప్రవేశ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృషిని కుటుంబ సభ్యులు స్మరించుకుని హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు, తమకు సొంత ఇల్లు కలగడానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేసిన సహకారం మరువలేనిదని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు ఏనుగుల ప్రశాంత్ కుమార్, మార్కెట్ డైరెక్టర్ కళ్లేపల్లి సతీష్,గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం కనకయ్య, జూలపల్లి సంపత్ రావు, వార్డు సభ్యులు దమ్మ వెంకటరమణ, పోలె శేఖర్, జోగు శంకర్, గోల్కొండ సురేష్, సుంకపాక అనిల్, గ్రామ కార్యదర్శి మిరుదొడ్డి శ్రీనివాస్, గోల్కొండ శ్యామ్ బాబు, దమ్మ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.