ఏజెన్సీలో రీ సర్వే కేవలం ఆదివాసులకి వర్తిస్తుంది.

★ హైకోర్టు నిబంధన పాటించకపోతే అధికారుల పై కోర్టు ధిక్కరణ కేసు పెడతాం. ★ ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు కాకి మధు హెచ్చరిక.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి .07.2026 శుక్రవారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కాకి మధు పోలవరం జిల్లాలోని పలు మండలాలలోని గ్రామాలు పర్యటించడం జరిగింది.ఈ సందర్భంగా రాజోవోమంగి మండలం చిన్నయా పాలెం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ఏజెన్సీ ప్రాంతాల్లో భారత రాజ్యాంగానికి విరుద్ధంగా నాన్ ట్రైబల్స్ కి భూములపై హక్కులు కల్పించే కుట్ర జరుగుతుందని.దీన్ని తక్షణమే అధికారులు నిలుపుదల చేయకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు.గత ప్రభుత్వ హయాంలో రీ సర్వే ప్రక్రియను తీసుకురాగా అప్పుడే ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాప్రయోజనాలు వ్యాజ్యం దాఖలు చేయడం జరిగిందని.ఈ కేసులో హైకోర్టు స్పష్టంగా 1970 తర్వాత ఏజెన్సీలో స్థిరపడిన నాన్ ట్రైబల్స్కు రీ సర్వే ద్వారా ఎటువంటి హక్కులు కల్పించడానికి వీల్లేదని మద్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో రీ సర్వే కొనసాగుతుందని.1/59,,1/70 చట్టాన్ని ఉల్లంఘించి ఏజెన్సీలో అక్రమంగా భూములు సంపాదించుకొని స్థిర చర ఆస్తులు కూడగట్టుకుని వ్యాపారాలు వ్యవసాయలు చేసుకుంటున్న నాన్ ట్రైబల్స్ ఆక్రమిత భూములకు రీ సర్వే వర్తించదని,అయినప్పటికీ ఏజెన్సీ ప్రాంతంలో అధికారులు 1970 తర్వాత వలస వచ్చిన నాన్ ట్రైబల్స్ కూడా రిసర్వ్ చేసే హక్కులు కల్పిస్తున్నారని.దీనిపై ఆదివాసిbసంక్షేమ పరిషత్ న్యాయస్థానంలో కంటెంట్ ఆఫ్ ది కోర్టు దాఖలు చేస్తామని హెచ్చరించారు.ఏజెన్సీలో భారత రాజ్యాంగం కల్పించిన భూ రక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఆదివాసులు కూడా ఆదివాసి చట్టాల అమలు కొరకు రాజకీయాలకతీతంగా ఐక్యంగా కలిసి పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిస్థితి డివిజన్ కో ఆర్డినేటర్ పీఠా ప్రసాద్,ఆదివారం సంక్షేమ పరిషత్ నాయకులు కారు అరుణకుమారి,ముళ్ళ పురుషోత్తం, గూడెం కృష్ణ సింహాచలం,చాట్ల అప్పారావు,లోత దుర్గ, కోపూరు మల్లేశ్వరరావు, గూడెం సత్యవతి, భూముల కాసులమ్మ,కోర కంటి సత్యవతి తదితరులు పాల్గొన్నారు.కాకి మధు ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పీఠ ప్రసాద్ డివిజన్ కోఆర్డినేటర్.