ఐఏఎస్ కు ఎంపికైన గుడెల్లి సృజన

పయనించే సూర్యుడు న్యూస్ పెద్దపల్లి, సెంటినరీ కాలనీ-07 పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూరు/సెంటనరికాలనీ చెందిన పద్మశాలి సింగరేణి ఉద్యోగి కుటుంబం గుడెల్లి రాజేశం-రాణి కూతురు గుడెల్లి సృజన 2025 ఆగస్టులో జరిగిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ) 2025 ఫలితాలలో రాతపరీక్షలో అర్హత సాధించి 2026 ఫిబ్రవరి 27న నిర్వహించిన పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూలు) ఫలితాలలో 958 మంది యోగ్యతపొంది నియామకానికి ఎంపికైన జాబితాలో 55వ ర్యాంక్ సాధించింది. గతంలో గ్రూప్-1లో 55 మార్కులతో 35 ర్యాంకు సాధించి డిఎస్పీగా నియామకమై ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *