కదలరు ఆ సీటు వదలరు .. వేరొకరిని రానివ్వరు.. అవినీతి ఆరోపణ ఉన్న పట్టించుకోరు పై అధికారులు..

పయనించే సూర్యుడు మార్చి 7, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) జిల్లాలో ఆదాయం వేయంలో వైశాల్యంలో అతిపెద్దదైన మండలం కాకినాడ రూరల్ మండలం ఈ మండలానికి వచ్చే కార్యదర్శులు ఏ పట్టానా ఇక్కడి నుంచి కదలరు.. వేరే కార్యదర్శులను ఇక్కడికి రానివ్వరు.. ఈ కార్యదర్శి మాకు వద్దు బాబోయ్ అంటున్న కార్యకర్తలు అన్న అధికారి పార్టీ నేతల బంధువుల ద్వారా మన్నలు తీసుకుని ఇక్కడే తిష్ట వేస్తారు. వీరిపై లెక్కకు మించిన అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ జిల్లాపంచాయతీ అధికారి కానీ కలెక్టర్ కానీ పట్టించుకోరు.. ఏ లేఅవుట్ నా లేఔట్ అయినా ముడుపులు చెల్లిస్తే వీళ్లకు అనుమతులు ఇస్తారు. ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే కులం కార్డు వాడుతారు. దాంతో వారు హవాను కొనసాగిస్తారు. కోట్లకు పగడాలెత్తుతున్న ఆరోపణలు ఉన్నాయి. తిమ్మాపురం గ్రామపంచాయతీ సామాజిక స్థలం అన్యాక్రాంతం ఈ కారణంగా కార్యదర్శి నుండి 37 కోట్ల రూపాయలు వారి నుండి వసూలు చేయాలంటూ విజిలెన్స్ నివేదిక ఇచ్చినప్పటికీ నేటి వరకు చర్యలు శూన్యమే.. అలాంటి వారికి ఈ మండలంలో స్వేచ్ఛగా కొనసాగించడం విశేషం.. ఆ ఉద్యోగి కాకినాడ రూరల్ పంచాయతీలో ఇప్పటికీ పనిచేయడం జరుగుతుంది. కృష్ణాజిల్లా పామర్ నుంచి పదోన్నతి పై కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామపంచాయతీకి వచ్చినప్పటికీ సెకండ్లలోనే పెదపూడి మండలం శాపురం గ్రామపంచాయతీకి డిప్యూటేషన్ పై పంపించడం విశేషం.. గ్రేడ్ వన్ అధికారి గ్రేడ్ 4 పంచాయతీల్లో పనిచేయడం ఏమిటని కొంతమంది ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఒక కార్యదర్శి 2 పంచాయతీలకు ఇన్చార్జిగా ఏమిటని ఇక్కడ అంత కలెక్షన్లు ఉంటున్నాయా అని ప్రజలు చర్చిలు జరుపుకుంటున్నారు.. జీవితం రమణయ్యపేట గ్రామపంచాయతీ ఉద్యోగం సహపుర గ్రామపంచాయతీలో ఇక్కడ మరొక దగ్గర ఉద్యోగం ఎలా చక్రం తిప్పడం పట్ల జిల్లా అధికారులు కు భారీ స్థాయిలో నెలవారి ముడుపులు అందుతున్నాయా అనే ఆరోపణలు గుప్పు మంటున్నాయి. అయితే కాకినాడ రూరల్ మండలంలో కార్యదర్శులు 20 సంవత్సరాలు పైబడే ఉద్యోగాలు వెలగబెట్టడం ద్వారా వారికి స్థానచలనం కలగక సంపాదనైజేయంగా పనిచేస్తూ కోట్ల రూపాయలకు పడగలు వ్యక్తిత్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఏది ఏమైనాప్పటికీ ప్రజల కోసం పనిచేసే అధికారులే కావాలంటూ ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటికే వాకలపూడి వలస పాకల రమణయ్యపేట చీడిగా ఇంద్రపాలెం, తూరంగి గ్రామ పంచాయతీలకు ఎన్నికలు గత 16 సంవత్సరాలుగా లేకపోవడంతో ప్రత్యేక అధికారి పాలనలో అభివృద్ధి కుంటుపడుతున్నదని దీనిపై ఎమ్మెల్యే పంతం నానాజీ అసెంబ్లీలో గలం ఇవ్వాలని వెంటనే విలీన గ్రామాలకు ఎన్నికలు జరిపించాలంటూ తమ స్వరాన్ని అసెంబ్లీలో తెలియజేశారని త్వరలో పంచాయతీ ఎన్నికలు వస్తే సర్పంచ్ పాలను వస్తే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని అందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాలకు భారీగా నిధులు అందిస్తారని ఆశాభావాన్ని ప్రజలు తెలియజేస్తున్నారు.