కల్లూరు ఎన్ఎస్పి కాలువ కట్ట మరియు మధిర రోడ్డు డంపింగ్ యార్డ్ దుర్వాసన

పయనించే సూర్యుడు:మార్చి 7/26 సత్తుపల్లి రూలర్: రిపోర్టర్: గద్దె. విజయ బాబు కల్లూరు ఎన్ఎస్పీ కాలువ కట్ట దగ్గర ఉన్న డంపింగ్ యార్డ్ లో మరియు మధిర రోడ్డు లో ఉన్న డంపింగ్ యార్డ్ లో ప్లాస్టిక్ కవర్లు డబ్బాలు డంపింగ్ యార్డ్ లో కాల్చడం వలన రాత్రిపూట వచ్చే పొగతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి ఇబ్బంది పడుతున్నారు గత ప్రభుత్వం కి ఎన్నిసార్లు చెప్పినా దృష్టి పెట్టలేదు దానివల్ల చెత్త కాల్చే క్రమంలో విషపు వాయువులు గాలిలో కలిసి చర్మవ్యాధులు ఆస్తమా క్యాన్సర్ అలాంటి వ్యాధులు ప్రభవిస్తాయని వాటికి దారి తీసే చెడు పదార్థాలు గాలిలో వ్యాపించడం వాటి వలన కల్లూరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వం ప్రజల బాధలను సమస్యల మీద ఉక్కు పాదం మోపి పూర్తిస్థాయిలో విచారణ చేసి శాశ్వతంగా నివారణ చేసే విధంగా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు