పయనించే సూర్యుడు మార్చ్ 7 (జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు ) జహీరాబాద్ పట్టణంలోని మాణిక్ ప్రభు వీధిలో నూతనంగా నిర్మించిన కొత్తకాపు ఈశ్వరమ్మ మండపాన్ని శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సిద్ధం ఉజ్వల్ రెడ్డి ప్రారంభించారు. కొత్తకాపు కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు మున్సిపల్ వైస్ చైర్మన్ శిరీష సురేందర్ రెడ్డితో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉజ్వల్ రెడ్డిని కొత్తకాపు కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ ముబీన్, జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రాములు, సీనియర్ నాయకులు పట్లోళ్ళ శ్రీకాంత్ రెడ్డి, సిడిసి డైరెక్టర్ మల్లారెడ్డి, కౌన్సిలర్ అరుణ్ కుమార్, యూత్ కాంగ్రెస్ మరియు సీనియర్ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి, అశ్విన్ పాటిల్, కిరణ్ కుమార్ గౌడ్, రవి, పవన్ మరియు కొత్తకాపు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.