గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా చెల్లించాలి

★ పాలకుర్తి ఎంపిడిఓ కార్యాలయం సూపర్డెంట్ వినతిపత్రం ★ రాజీవ్ చౌరస్తాలో నిరసన

పయనించే సూర్యుడు మార్చి 7 ( జనగాం ప్రతినిధి కమ్మగాని నాగన్న)గ్రామపంచాయతీ సిబ్బందికి వేతనాలు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా గ్రీన్ ఛానల్ ద్వారా సిబ్బంది అకౌంట్లో జమ చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల సోమన్న అన్నారు శుక్రవారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా చేసి అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సూపర్డెంట్ రవీందర్ గారికి అందజేశారు అనంతరం పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సోమన్న పాల్గొని మాట్లాడుతూ మార్చి 02న వేతనాలు గ్రామపంచాయతీ పాలకవర్గాలే చెల్లించాలని పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్ నుండి సర్కులర్ జారీ చేయడం దుర్మార్గమైన చర్య అని జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు గడిచిన గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు గ్రామపంచాయతీ అవసరాల మేరకు తీసుకున్న గ్రామపంచాయతీ కార్మికుల అందర్నీ ఆన్లైన్లో నమోదు చేయకుండా వేతనాలు చెల్లించకుండా వందలాది మంది గ్రామపంచాయతీ కార్మికులకు అన్యాయం చేస్తే సహించేది లేదని గ్రామపంచాయతీ సిబ్బంది పర్మినెంట్ చేయాలని రెండో పిఆర్సి లో గుర్తించి కనీస వేతనం నెలకు 26వేల రూపాయలు చెల్లించాలన్నారు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు 20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉద్యోగ భద్రత కల్పించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఈ సమస్యల పరిష్కారం కోసం పంచాయతీ కార్మికులు ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసేందుకు సిద్ధం కావాలని కోరారు, ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు కుక్కల సోమన్న, ముస్తఫా, పరంజ్యోతి, రాజు, వెంకన్న, యాకుబ్, అశోక్, దేవా, కృష్ణ, నరేష్, కిష్టయ్య, యాదగిరి, సుశీల, లక్ష్మి, ఎల్లమ్మ, అరుణ, రమణ, సోమయ్య, ఎండి అంజాద్ ఖాన్, వెన్న రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు