ఘనంగా శ్రీరేణుకఎల్లమ్మ తల్లి పండుగలు.

★ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం సందర్శించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి.

పయనించే సూర్యుడు, మార్చి 7 నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం రిపోర్టర్ :సుల్తాన్ తెలకపల్లి మండల కేంద్రంలోని మార్పాకుల కౌండిన్య గౌడ సంఘం సభ్యులు నిర్మాణం చేసిన శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని శుక్రవారం ఎమ్మెల్యే కూచుకుళ్ళరాజేష్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవాలయంలో కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ నిర్వహకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనకు దేవాలయాలు దోహదం చేస్తాయని.ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ కొమ్ము చంద్రశేఖర్, ఉపసర్పంచ్ శ్రీనివాసులు, ఎల్లమ్మ తల్లి పూజలు నిర్వహించి శారదమ్మ,ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.