పయనించే సూర్యుడు 7.2.2026 రిపోర్టర్ : శ్రవణ్ రాజ్ తే. 05-03-2026 దిన చీడికాడ మండలం జైతవరం గ్రామంలో గొర్రెలు మరియు మేకలకు జరుగుతున్న చీడ పారుడు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని వి. మాడుగుల ఏరియా పశు వైద్యశాల సహాయ సంచాలకులు డా. చిట్టి నాయుడు ఆకస్మికంగా హాజరై టీకాలు వేస్తున్న తీరుని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13 వ తేదీ వరకు గొర్రెలు మరియు మేకలకు జరుగుతున్న చీడ పారుడు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం గురించి మండలంలోని అన్నీ రైతు సేవా కేంద్రాల పరిధిలో ఉన్న గొర్రెలు, మేకల పెంపకం దారులకు అవగాహన కల్పించి ఈ అవకాశాన్ని వినియోగించుకోనెలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక సహాయకులు శ్రీనివాసరావు పాల్గొన్నారు.