జడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు పరీక్ష పాడ్స్, పెన్నులు పంపిణీ చేసిన కోమల్ల జలందర్..

పయనించే సూర్యుడు 7-2-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో పదవ తరగతి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న జడ్పీహెచ్ఎస్ (బాయ్స్&గర్ల్స్) విద్యార్థులకు పరీక్ష పాడ్స్, పెన్నులు పంపిణీ చేసిన ముదిరాజ్ సంఘమ్ మండల అధ్యక్షుడు కోమల్ల జలందర్. ఈ సందర్భంగా జలందర్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు సాధించాలని సూచించారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జి స్కిల్స్ & కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంస్థ యజమాని ముంజంపల్లి రమేష్, గొల్లపెల్లి 5వార్డు సభ్యులు సంగేమ్ కళ్యాణ్ కుమార్, ఐతరవేని వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు