డాక్టరెట్ పట్టా పొందిన సంతోష్

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 7 మంథని నియోజకవర్గ ఇంచార్జి రమేష్, మంథని జెఏన్ టియు ఇంజనీరింగ్ కళాశాల ఈ ఈ ఈ డిపార్ట్మెంట్ లో సహాయ అధ్యాపకునిగా పని చేస్తున్న ఏరువాక సంతోష్ కు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డాక్టరేట్ పట్టా దక్కింది. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జె. ఉపేందర్ పర్యవేక్షణలో సంతోష్ ఆప్టిమల్ ప్లేస్ మెంట్ అండ్ సైజింగ్ అఫ్ డిస్ట్రిబ్యూటెడ్ జనరేషన్ టూ మినిమైజ్ ఆక్టివ్ పవర్ లాస్ యూసింగ్ నావెల్ మెటా హ్యూరిస్టిక్ టెక్నిక్స్ అనే అంశంపై పరిశోధన చేసి సమర్పించారు. పెరుగుతున్న డిమాండ్ కి అనుగుణంగా పంపిణీలో ఏర్పడే ఆక్టివ్ పవర్ లాసెస్ తగ్గించడం, డిస్టిబ్యూటెడ్ జనరేషన్ యూనిట్లను సరైన స్థానంలో, సరైన పరిమాణంలో ఏర్పాటు చేసి విద్యుత్ నష్టాలను తగ్గించే విధానాలను నవీన మెటా హ్యూరిస్టిక్ అల్గోరిథమ్స్ సహాయంతో పరిశీలించి పరిశోధనలో పొందుపర్చారు. విద్యుత్ పంపిణి వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచడంలో, ఆధునిక విద్యుత్ గ్రిడ్ అభివృద్ధికి, పునరుత్పాదక శక్తి వనరుల సమర్థ వినియోగానికి, భవిష్యత్తు స్మార్ట్ గ్రిడ్ కి ఉపయోగకరంగా ఉంటాయని పరిశోధనలో పేర్కొన్నారు. దీనిపై సంతృప్తి చెందిన ఉస్మానియా యూనివర్సిటీ సంతోష్ కు డాక్టరేట్ పట్టాను అందించింది. రామగిరి మండలం ఆదివారంపేట్ గ్రామానికి చెందిన సంతోష్ గత 10 సంవత్సరాలుగా మంథని జెఏన్ టియు లో సహాయ అధ్యాపకునిగా పని చేస్తున్నారు. డాక్టరేట్ పట్టా పొందిన సంతోష్ ని మంథని జెఏన్ టియు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ బి. విష్ణువర్ధన్, వైస్ ప్రిన్సిపాల్ ఎం. ఉదయ్ కుమార్ తో పాటు తోటి అధ్యాపకులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది అభినందించారు.