డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: విజయ స్కూల్‌లో పోలీసుల అవగాహన సదస్సు

పయనించే సూర్యడు / మార్చ్ 07/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ వాడకం వల్ల జీవితాలు చిన్నాభిన్నం అవుతాయని కుషాయిగూడ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జి. వెంకటేశ్వర్లు హెచ్చరించారు. శుక్రవారం కాప్రాలోని విజయ హై స్కూల్‌లో విద్యార్థులకు 'యాంటీ డ్రగ్ అవేర్‌నెస్' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణతో ఉంటూ లక్ష్యాల వైపు సాగాలని, డ్రగ్స్ వంటి దురలవాట్లకు బానిసలై భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సూచించారు. సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు, చట్టపరమైన చర్యల గురించి విద్యార్థులకు వివరించారు. అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.