డ్రగ్ ఇన్స్పెక్టర్ షేక్ ఫర్వేన సుల్తానా పై చర్యలు తీసుకోవాలని.. తప్పు చేస్తే క్షమించేది లేదు.. ఎంపీ తంగేళ్ల..

పయనించే సూర్యుడు మార్చి 7, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) ది కాకినాడ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ నివాసం నందు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జి గిరిధర్, కాకినాడ అధ్యక్షులు సాయిరాం సత్యనారాయణ, కార్యదర్శి సురేష్ ,ట్రెజరర్ ఎం హనుమంతరావు మరియు డాక్టర్ చెట్ల రవి కిరణ్ లు మాట్లాడుతూ గత ఎనిమిది నెల కాలంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ షేక్ ఫర్వేన సుల్తానా చాలా ఇబ్బందులు గురి చేస్తుందని డబ్బులు తీసుకుని తీసుకోలేనట్లుగా లెటర్లు కూడా రాయించుకుంటుందని ఈమె వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయని ఈరోజు కాకినాడ టౌన్ ఆధ్వర్యంలో సుమారు 450 మెడికల్ షాపులను స్వచ్ఛందంగా మూసి వేయడం జరిగిందని తెలిపారు. ఆమె పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈరోజు కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ ను కలుసుకోవడం జరిగిందని తెలిపారు. వెంటనే ఎంపీ స్పందిస్తూ తప్పు చేసిన వారు ఎవరైనా ఒకటేనని తప్పు అని తెలిస్తే చర్యలు తప్పక తీసుకుంటామని తెలిపారు.సంబంధిత అధికారులకు ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 450 మంది అసోసియేషన్ సభ్యులు పాల్గొని తమ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం కలెక్టరేట్కు వినతిపత్రంను అందజేయడానికి వెళ్లడం జరిగింది.