దోచేసిన సి ఎస్ ఆర్ నిధులు ఏవి.. సమాధానం చెప్పని అటవీశాఖ అధికారులు..

* ఒఎన్‌జిసి డబ్బులు ఇవ్వలేదంటూ అబద్దాలు * స్థలాన్ని మాత్రమే అప్పజెప్పామని చెబుతున్న ఏపిఐఐసి..

పయనించే సూర్యుడు మార్చి 7, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) దొరికితే దొంగ లేకపోతే దొర అన్న చందాగా ఉంది అటవీ శాఖ అధికారులు తీరు.. పరిశ్రమలు విడుదల చేస్తున్న కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి నిధులను(సిఎసఆర్) కొన్ని శాఖలు దోచేసి పాపాం మాది కాదంటే మాది కాదంటూ తప్పించుకుంటున్నారు. పారిశ్రమలు వాటి దగ్గరలో ఉన్న ప్రాంతాల ప్రజలకు కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను విడుదల చేసి వివిధ సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తింటాయి. ఆ కోవలోనే కాకినాడరూరల్ మండలం రమణయ్యపేట పంచాయితీ పరిదిలో ఉన్న పారిశ్రామిక వాడలో ఉన్న పార్కును పచ్చని మొక్కలతో పార్కుగా అభివృద్ధి చేసేందుకు ఓఎన్‌జిసి 10లక్షల రూపాయల సిఎసఆర్ నిధులను విడుదల చేసినట్లు తెలిసింది. పార్కులో మొక్కలు నాటి వాటి నిర్వహణకు ఏపిఐఐసి`అటవీ శాఖలు కలసి సంయుక్తంగా ఈ నిధులను ఉపయోగించి మొక్కలను పెంచాల్సి ఉంటుంది. అయితే ఆరు నెలల క్రితం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. తీరా ఆరునెలల తర్వాత చూస్తే ఆమొక్కల్లో చాలా మొక్కలు నిర్వహణలేక చనిపోవడం జరిగింది. అయితే ఈ 10లక్షల నిధులు ఎవరుతీసుకున్నారనే దానిపై రెండు శాఖలు రకరకాల సమాధానాలు చెబుతున్నారు. ఏపిఐఐసి జెడఎం ఆయన పరిదిలో ఉన్న పార్కును అటవీశాఖకు అప్పజెప్పడం జరిగిందని, నిధుల విషయంలో తనకేమాత్రం సంబందంలేదని చెబుతున్నారు. పత్రికల్లో ఈ విషయంపై వచ్చిన వార్తలను తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు చడీ చప్పుడు లేకుండా పార్కులోకి వెళ్ళి పాతిన మొక్కలను, చనిపోయిన మొక్కలను లెక్క పెట్టుకోవడం మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న పాత్రికేయుడు అక్కడ వెళ్ళి సిఎసఆర్ నిధులు ఇచ్చిన ఎందుకు నిర్వహణ చేయలేదని, మొక్కలు చనిపోవడానికి ఎవరి కారణమని వివరణ అడుగగా అటవీ శాఖ అధికారి సుభాని తమకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తమ స్వంత డబ్బులతో నిర్వహణ చూసుకున్నామని చెప్పడం జరిగింది. దీనిపై జిల్లా అటవీ శాఖ అధికారికి పోన్ చేసి వివరణ అడుగగా తనకు ఆ విషయంపై అంతగా స్పష్టత లేదని, ప్రస్తుతం పనిచేస్తున్న అటవీ శాఖ రేంజ్ అధికారి పద్మజకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలన్నారు. దీనిపై పద్మజను ఫోన్ చేయగా తనకు కూడా పూర్తి వివరాలు తెలియదని, మరో అధికారి సుభానిని అడుగమనగా, ఆయనకు ఫోన్ చేసి అడుగగా తనకు ముందు బాద్యతలు నిర్వహించిన ప్రసాద్ అనే ఉద్యోగిని అడగాలని, ప్రస్తుతం ఆయన కాశీ యాత్రకు వెళ్ళారని వచ్చిన తర్వాత వివరాలు అందిస్తామని చెప్పడం జరిగింది. అయితే వారి తడబడే మాటల్లో ఆ నిధులను వారే కాజేసారని తెలుస్తుంది. ఆ తర్వాత ఎవ్వరూ వివరణ ఇవ్వకపోవడంతో మార్చి 2వ తేదీని సిఎసఆర్ నిధుల గోల్‌మాల్‌పై పిజిఆరఎస్‌లో పిర్యాదు చేయడం జరిగింది. దీనిని కూడా ఆన్‌లైన్ చేయకుండా పిర్యాదును పక్కకు పెట్టాసారంటే సిఎసఆర్ నిధులను అటవీ శాఖ అధికారులే గోల్‌మాల్ చేశారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు పూర్తి విచారణ చేపట్టి తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుని సిఎసఆర్ నిధులకు న్యాయం చేయాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *