పయనించే సూర్యుడు మార్చి 7 స్వతంత్రము వచ్చినప్పుడు కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి బాబు జగజ్జివన్ రామ్ కు కరపత్రం ఇవ్వడం జరిగింది.ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గలలో మూతపడ్డ పరిశ్రమల వల్ల ఎంతోమంది ఉపాధి లేక నిరాశరాలై వారి యొక్క జీవితం చీకటిమయంగా మారిపోయింది. ఆదోని ప్రాంతంలో సామాన్య ప్రజలు ఉపాధి కోల్పోవడం వల్ల వారి యొక్క పిల్లలకి ఉన్నతమైన చదువులో అందించలేక అర్ధాంతరంగా వారి చదువులు ఆగిపోయినాయి. ఈ ఐదు నియోజకవర్గాల ప్రాంతంలో మూతపడ్డ పరిశ్రమలు కనీసం తిరిగి ప్రారంభించాలని ఆలోచన ఏ ప్రజాపాలకుడు ఆలోచన చేయలేదు. ఉన్నతమైన చదువులు చదవాలన్న ఆశ కూడా సామాన్య ప్రజల పిల్లలకు అందించలేకపోయారు. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఐదు నియోజకవర్గాల్లో నూతన పరిశ్రమలు ప్రారంభించాలని ఆలోచన కూడా ఏ రాజకీయ నాయకుడు ప్రయత్నం చేయలేదు. ప్రజా వైద్యశాలలో నాణ్యమైన వైద్య సదుపాయాలు లేక కనీసం పాముకాటు, తేలుకాటు మందులు కూడా కల్పించలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయ నాయకులు ఉన్నారు. కాబట్టి మా ఆదోని రెవెన్యూ డివిజన్ ను ఆదోని జిల్లాగా ప్రకటించి మానిధులు మేమే ఉపయోగించుకునే అభివృద్ధి చెందే విధంగా సహకరించాలి. మా పరిశ్రమలు మేము నిర్మించుకొని మా నిరుద్యోగులకు మేము ఉపాధి కల్పించుకుంటాం. కేంద్ర రాష్ట్రాల నుండి వచ్చే నిధులు ద్వారా మా ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం. ఆదోని జిల్లా ఉద్యమానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు రాజకీయ నాయకులు కలిసి రావాలి. ఆదోని జిల్లా సాధించేవరకు ఉద్యమం కొనసాగుతుంది. ఆదోని జిల్లా సాధనలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు, జడ్పిటిసిలు ఎంపీటీసీలు సర్పంచులు కలిసి రాకపోతే ఈ ప్రాంత ప్రజల ద్రోహులుగా చిత్రీకరించబడతారు. కాబట్టి ఇప్పటికైనా ఆయా పార్టీల రాజకీయ నాయకులు వారి యొక్క ఆధిపత్య నాయకుల ద్వారా ఒత్తిడి తీసుకొని వచ్చి ఆదోని జిల్లా ప్రకటించాలి. 111వ రోజు రిలే నిరాహార దీక్షలో రామాంజనేయులు, సుభాష్ చంద్రబోస్, బూదెప్ప, జగన్ దీక్షలో కూర్చొని మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆదోని జిల్లా సాధన జేఏసీ నాయకులు పగడాల కోదండ, గోవిందు, పిఎస్ వీరేష్, గుమ్మల బాలస్వామి, అడ్వకేట్ రామాంజనేయులు, వై.పి నాగరాజు, రామకృష్ణ, తదితరులు పాల్గొని ఈరోజు దీక్షను విజయవంతం చేశారు
