పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ

* ఏకాగ్రతతో చదివి మంచి మార్కులు సాధించాలి: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

పయనించే సూర్యడు / మార్చ్ 07/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు పదో తరగతి విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా ఏకాగ్రతతో చదివి పరీక్షల్లో తమ సత్తా చాటాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మీర్‌పేట్ హెచ్‌బి కాలనీ డివిజన్ పరిధిలోని సెయింట్ పాల్ స్కూల్ విద్యార్థులకు ప్రోత్సాహక కానుకలను పంపిణీ చేశారు. డివిజన్ మాజీ అధ్యక్షుడు కరిపే ప్రవీణ్ వంజరి సహకారంతో ఏర్పాటు చేసిన పరీక్ష అట్టలు (ఎగ్జామ్ ప్యాడ్స్), జామెట్రీ బాక్సులను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పరీక్షలు దగ్గర పడుతున్న వేళ విద్యార్థులు చదువుపైనే పూర్తి దృష్టి పెట్టాలన్నారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జేరిపోతుల ప్రభుదాస్, గుండారపు శ్రీనివాస్ రెడ్డి, గొల్లూరి అంజయ్య పాల్గొన్నారు. అలాగే స్థానిక నాయకులు ఉల్లెం బాలరాజు, మల్లేష్ గౌడ్, దేవేందర్ కుమార్, వసంత రావు, వాసు చారి, నవీన్ గౌడ్, మధు ముదిరాజ్, రామకృష్ణ, కిరణ్, హరినాథ్ రెడ్డి, భూపాల్ గౌడ్, దండెం నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *